మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించడానికి కారణం అదేనా?

మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశంలోకి ప్రవేశించించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

Update: 2024-01-21 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశంలోకి ప్రవేశించించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు కంచెలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దాదాపు 600 మందికి పైగా మిజోరం సరిహద్దు ద్వారా మయన్మార్ సైనికులు భారత్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. కాగా, గత కొంతకాలంగా మయన్మార్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటరీ పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య పోరు జరుగుతోంది. దాంతో మయన్మార్‌ ఆర్మీకి చెందిన వందలాదిమంది సిబ్బంది మిజోరం సరిహద్దుల ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈ పరిణామాలపై మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. వారిని తిరిగి వెంటనే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

Tags:    

Similar News