Boat Accident : ముంబయి పడవ ప్రమాదం.. 13 మంది మృతి

ముంబయి(Mumbai) తీరంలో పడవ బోల్తా(Boat Accident) పడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది.

Update: 2024-12-18 15:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : ముంబయి(Mumbai) తీరంలో పడవ బోల్తా(Boat Accident) పడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 101 మందిని రెస్క్యూటీం రక్షించారు. పర్యాటకులతో కూడిన పడవ 'గేట్ వే ఆఫ్ ఇండియా'(Gate Way Of India) నుంచి ఎలిఫెంటా కేవ్స్(Elefenta Caves) కు వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ఫెర్రీని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాద సమయంలో పడవలో 135 మంది పర్యాటకులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన వారికోసం పోర్ట్ అధికారులు, కోస్ట్ గార్డ్, మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలియ జేశారు.

Tags:    

Similar News