Misleading ads: 45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు.. రూ.61 లక్షల జరిమానా

తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన కారణంగా వివిధ కోచింగ్ సెంటర్లకు 45 నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Update: 2024-12-18 18:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన కారణంగా వివిధ కోచింగ్ సెంటర్లకు 45 నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 19 ఇన్‌స్టిట్యూట్‌లకు రూ.61.6లక్షల జరిమానా విధించినట్టు తెలిపింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. దీనికోసం నూతన చట్టాలు సైతం రూపొందించనున్నట్టు చెప్పారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, జేఈఈ, నీట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH) విజయవంతంగా పరిష్కరించిందని స్పష్టం చేశారు. ఫలితంగా రూ.1.15 కోట్లకు పైగా ఫీజును విద్యార్థులకు తిరిగి చెల్లించినట్టు తెలిపారు. 

Tags:    

Similar News