జమిలి ఎన్నికలపై మరో సంచలనం.. జేపీసీ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం
జమిలి ఎన్నికలపై కేంద్రం దూకుడు పెంచింది....
దిశ, వెబ్ డెస్క్: జమిలి ఎన్నికల(Jamili Election)పై కేంద్రం దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎంపీ(Mp), ఎమ్మెల్యే(Mla), అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం(NDA Govt) నిర్ణయించి విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన బిల్లులు లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టేందుకు ఎంపీల అభిప్రాయం తీసుకుంది. అత్యధిక సభ్యులు మద్దతు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో 360 మంది ఎంపీలు, బ్యాలెట్ విధానంలో మరికొందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఓటింగ్‌లో అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో జమిలి ఎన్నికలపై లోక్ సభలో చర్చ జరిగేందుకు ఆమోదముద్ర పడింది.
దీంతో తాజాగా కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(Joint Parliamentary Committee)ని కేంద్రం నియమించింది. ఈ కమిటీలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం కల్పించింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 31 మంది ఎంపీలను నియమించింది. ఈ కమిటీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక, మనీష్‌కు చోటు కల్పించింది. ఈ ఎన్నికలకు సంబంధించి జేపీసీ ప్రతిపాదనలను వచ్చే పార్లమెంట్ సమావేశాలలోపు నివేదిక ఇవ్వాలని కేంద్రం సూచించింది.