‘ఆధార్‌’తో గోప్యతా సమస్యలు.. మూడీస్ నివేదికలో ఆరోపణలు

Update: 2023-09-26 17:09 GMT

న్యూఢిల్లీ: భారతదేశంలో ఆధార్ సిస్టమ్‌‌కు సంబంధించి భద్రత, గోప్యతా సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తిన మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదికపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఆధార్‌ను ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీగా పేర్కొంది. ఎటువంటి రుజువులు, ఆధారాలు లేకుండా ఆ నివేదికను తయారు చేశారంటూ కొట్టిపారేసింది. కాగా.. వేడి, తేమతో కూడిన వాతావరణంలో మాన్యువల్ కార్మికుల కోసం బయోమెట్రిక్ టెక్నాలజీల్లో ఆధార్ సిస్టమ్ విశ్వసనీయతను మూడీస్ నివేదిక ప్రశ్నార్థకంగా పేర్కొంది.

అయితే, భద్రతా సమస్యలపై లేవనెత్తిన ప్రశ్నలకు ఐటీ మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటనలో సమాధానమిచ్చింది. ఇప్పటి వరకు ఆధార్ డేటాబేస్ ఉల్లంఘన జరగలేదని చట్టసభ సభ్యులకు తెలియజేశామని తెలిపింది. ‘గత దశాబ్ద కాలంలో 100 బిలియన్ కంటే ఎక్కువ సార్లు తమను తాము ప్రామాణీకరించుకోవడానికి ఒక బిలియన్ భారతీయులు ఆధార్‌పై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారని పేర్కొంది.


Similar News