Maharshtra: మహారాష్ట్రలో వీబీఏ దూకుడు.. 10 మంది అభ్యర్థుల ప్రకటన

మహారాష్ట్రలో ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) దూకుడు పెంచింది.

Update: 2024-10-09 16:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) దూకుడు పెంచింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను ఇప్పటికే మొదటి జాబితా రిలీజ్ చేసిన వీబీఏ బుధవారం రెండో లిస్ట్ ప్రకటించింది.10 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. పది మంది ముస్లిం అభ్యర్థులే కావడం గమనార్హం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో వీబీఏ ఉన్నట్టు కనిపిస్తోంది. అంతకుముందు సెప్టెంబర్ 21న ఒక ట్రాన్స్‌జెండర్‌తో సహా 11 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను వీబీఏ ప్రకటించింది. కాగా, 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కలిసి ఎన్నికల్లో పాల్గొంటుండగా.. వీబీఏ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగనున్నట్టు ప్రకటించింది.


Similar News