బద్లాపూర్ ఘటనలో మరిన్ని షాకింగ్ విషయాలు

ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై జరిగిన లైంగిక దాడి థానెతో పాటు మహారాష్ట్రవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది.

Update: 2024-08-23 13:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై జరిగిన లైంగిక దాడి థానెతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. ఓ పాఠశాల స్వీపర్ అక్కడ చదువుతున్న ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడగా.. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నిందితుడు గత పదిహేను రోజుల్లో పలుమార్లు ఆ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిటీ విచారణలో వెల్లడైంది. నిందితుడు అక్షయ్ రాయ్ గురించి ఎలాంటి తనిఖీలు చేయకుండానే ఉద్యోగంలో చేర్చుకున్నారని, కనీసం పాఠశాల ఐడీ కార్డ్ కూడా లేదని కమిటీ తెలిపింది. ఇక ఈ కేసులో పాఠశాల యాజమాన్యం ముందు అలాంటిది ఏమీ లేదని బుకాయించిందని, కాని ఘటన జరిగింది వాస్తవేమనని దర్యాప్తులో తేలిందన్నారు. చిన్నారుల వాష్ రూమ్ స్టాఫ్ రూమ్ కి దూరంగా ఉందన్న కారణంగా సీసీ కెమెరా ఏర్పాటు చేయలేదని పాఠశాల యాజమాన్యం తెలిపిందన్నారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కాగా పాఠశాల ప్రిన్సిపాల్ ను , ఇద్దరు సిబ్బందిని తొలగించి యాజమాన్యం చేతులు దులుపుకుంది.

థానెలోని బద్లాపూర్ పట్టణంలో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై ఆ పాఠశాలలో పనిచేసే స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికలు వాష్ రూమ్ కి వెళ్ళినపుడు వాష్ రూమ్ క్లీనింగ్ వంకతో అక్కడికి వెళ్ళి దాడికి పాల్పడ్డాడు. అయితే విషయం బయటికి చెప్తే చంపేస్తానని అనడంతో బాలికలు బయపడి ఎవరికి చెప్పలేదు. ఇంటికి వెళ్ళాక ప్రైవేట్ పార్ట్శ్ లో విపరీతంగా నొప్పితో బాధపడుతున్నారని గ్రహించిన పేరెంట్స్ డాక్టర్ కు చూపించగ వారు లైంగిక దాడికి గురైనట్టు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల మీద దాడి చేసి, పోలీసు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి బద్లాపూర్, థానె మాత్రమే కాకుండా మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన దుమారం రేపుతోంది. బద్లాపూర్ లో ఏకంగా పదిగంటల పాటు రైళ్లను ఆపివేసి నిరసనలు చేశారు. కాగా ఈ ఘటన కేవలం రాజకీయ కోణంలో మాత్రమే ఉందని సీఎం ఏక్ నాథ్ షిండే ప్రకటించడం కూడా నిరసనలకు ఆజ్యం పోసినట్టైంది.


Similar News