సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం.. 24 ఏళ్ల తర్వాత మారిన ఒడిషా రాజకీయ ముఖచిత్రం

ఒడిషా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చేసుకుంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎల్పీ నేత మోహన్ మాఝీ బుధవారం ప్రమాణ

Update: 2024-06-12 12:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చేసుకుంది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎల్పీ నేత మోహన్ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలు ప్రవతి పరిదా, సింగ్ దేవ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ వీరి చేత ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిషా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 24 ఏళ్ల సుధీర్ఘ సమయం తర్వాత ఒడిషాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దాదాపు 20 ఏండ్లుగా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ ఆ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బిజూ జనతాదళ్ పార్టీ ఓటమి పాలైంది. ఒడిషాలో ఘన విజయం సాధించిన బీజేపీ ఫస్ట్ టైమ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాలుగు సార్లు ఎమ్మె్ల్యేగా విజయం సాధించిన ఆదివాసీ నేత మోహన్ మాఝీని బీజేపీ హై కమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయనను బీజేపీ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో మోహన్ మాఝీ ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర బీజేపీ ప్రముఖ నేతలు హాజరయ్యారు. కాగా, ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. అరుణాచల్ ప్రదేశ్, ఒడిషాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ఏపీలో ఎన్డీఏ కూటమి మిత్ర పక్షలు టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి అధికారం చేజిక్కించుకుంది.


Similar News