ఇజ్రాయెల్‌తో యుద్దం.. పాలస్తీనా అధ్యక్షుడికి మోదీ ఫోన్

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గత కొద్దిరోజులుగా భీకర యుద్దం

Update: 2023-10-19 17:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గత కొద్దిరోజులుగా భీకర యుద్దం జరుగుతోంది. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాడికి పాల్పడంతో రెండు దేశాల మధ్య యుద్దం మొదలైంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ రాకెట్లతో దాడులకు దిగుతుండగా.. హమాస్ కూడా తిప్పికొడుతుంది. బాంబు దాడుల్లో ఇప్పటివరకు ఇరు వర్గాలకు చెందిన 5 వేల మంది మరణించినట్లు చెబుతున్నారు. అలాగే వైమానిక దాడుల్లో వేలమంది గాయపడ్డారు.

ఈ క్రమంలో ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్దంపై ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. ఆయా దేశాల నేతలకు ఫోన్లు చేసి యుద్దం ఆపేయాలని, శాంతి చర్చలు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పాలస్తీనాలోని గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చాలామంది మృతి చెందారు. బాధితులకు  సంతాపం ప్రకటించిన మోదీ.. పాలస్తీనా ప్రజలకు సాయం చేస్తామని ఫోన్‌లో హామీ ఇచ్చారు. పాలస్తీనాలో నెలకొన్న తీవ్రవాదం, హింసపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


Similar News