మోడీ లక్ష్యం 'ఒకే దేశం, ఒకే నాయకుడు'.. ఆయన తర్వాత ప్రధాని ఎవరు?: కేజ్రీవాల్

మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Update: 2024-05-11 09:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన మోడీకి 'ఒకే దేశం, ఒకే నాయకుడు' అనే ఒకే ఒక లక్ష్యం ఉందని ఆయన దృష్టిలో దేశంలో మరో నాయకుడు ఉండకూడదని కేజ్రీవాల్ విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని మట్టికరిపించేందుకు ప్రధాని మోడీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు, మా పార్టీని అణిచివేసేందుకు ప్రధాని ఏ రాయిని వదిలిపెట్టలేదు, ఒక సంవత్సరంలో నలుగురు ఆప్ నేతలను జైలుకు పంపారని ఆయన అన్నారు. హనుమంతుడు మా పార్టీని ఆశీర్వదించాడు, ఒక అద్భుతం జరిగింది, అందుకే నేను మీ మధ్య ఉన్నానని కేజ్రీవాల్ మీడియా సమావేశంలో చెప్పారు.

ఎల్‌కే అద్వానీ, శివరాజ్‌సింగ్ చౌహాన్‌లు 75 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారు, ఆ విధంగా చూసుకుంటే మోడీ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయాలి, అప్పుడు బీజేపీ తదుపరి ప్రధాని ఎవరు అని ఆయన అన్నారు. అమిత్ షాకు ఓటు వేయాలని మోడీ అడుగుతున్నారని కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. అంతకుముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన భార్య సునీత, భగవంత్ మాన్‌తో శనివారం సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. శనివారం కేజ్రీవాల్ రెండు రోడ్‌షోలు నిర్వహించనున్నారు, వాటిలో ఒకటి దక్షిణ ఢిల్లీలో, మరొకటి తూర్పు ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నాయి.



Similar News