MK Stalin: మత్య్సకారుల విడుదలకు కేంద్రం చొరవ చూపాలి.. తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి

భారత మత్స్యకారులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-09 13:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన భారత మత్స్యకారులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ‘ఈ ఏడాది ఇప్పటివరకు 350 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. 49 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. గత ఆరేళ్లలో ఇదే అత్యధికం. అంతేగాక మత్స్యకారులకు భారీ జరిమానాలు సైతం విధిస్తోంది. కాబట్టి పడవలను విడిచిపెట్టడం, మత్య్స కారులను రిలీజ్ చేయడంలో జోక్యం చేసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే దౌత్యపరమైన ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఎలాంటి జరిమానా లేకుండా మత్స్యకారులను వెనక్కి తీసుకురావాలని కోరారు. కాగా, ఈ నెల7న పుదుకోట్టైకి చెందిన 14 మంది మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు గత నెల 5న 12 మంది మత్స్యకారులను అరెస్టు చేయడంతో వారిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తరువైకులంలో మత్స్యకారుల కుటుంబాలు నిరాహార దీక్షలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Similar News