Kejriwal: ఆ రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే బీజేపీకి ప్రచారం చేస్తా.. మోడీకి కేజ్రీవాల్ సవాల్

ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు.

Update: 2024-10-06 09:49 GMT

దిశ, నేషన్ బ్యూరో: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే ఆ ఎలక్షన్స్‌లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘హర్యానా, జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు త్వరలోనే కూలిపోతాయి. మొదటి ఇంజన్ జూన్‌లో విఫలమైంది, జార్ఖండ్, మహారాష్ట్రలోనూ మరో ఇంజన్ ఫెయిలవడం ఖాయం’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఫ్రీకరెంట్ అందిస్తే బీజేపీ తరఫున క్యాంపెయిన్ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

బీజేపీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమని ఆరోపించారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, ఎల్జీ పాలనలో ఉందని ఆరోపించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. 90వ దశకంలో ముంబైలో అండర్ వరల్డ్ రూల్ ఉండేదని, ఢిల్లీలో కూడా అదే జరుగుతోందని పైర్ అయ్యారు. బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడం, హోంగార్డుల జీతాలు నిలిపివేయడం సరికాదన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని విమర్శించారు. డబుల్ ఇంజన్ మోడల్ డబుల్ అవినీతికి పాల్పడిందని ఎద్దేవా చేశారు. 


Similar News