కూతురికి ‘బిపర్జాయ్’ పేరు పెట్టుకుంది

ప్రకృతి వైపరీత్యాల టైంలో పుట్టిన పిల్లలకు ఆ పేర్లు పెట్టే ట్రెండ్ ను గుజరాత్ కు చెందిన ఓ మహిళ ఫాలో అయింది.

Update: 2023-06-15 10:29 GMT

జఖౌ (గుజరాత్): ప్రకృతి వైపరీత్యాల టైంలో పుట్టిన పిల్లలకు ఆ పేర్లు పెట్టే ట్రెండ్ ను గుజరాత్ కు చెందిన ఓ మహిళ ఫాలో అయింది. ఆమె తన ఆడ శిశువుకు ‘బిపర్జాయ్’ అని పేరు పెట్టింది. గుజరాత్‌ లోని కచ్ జిల్లాలో ఉన్న తీర ప్రాంతాలకు ‘బిపర్జాయ్’ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సురక్షిత ప్రాంతాల్లోని షెల్టర్ హౌస్‌లకు తరలించిన వేలాది మందిలో ఒకరైన మహిళ తన శిశువుకు తుఫాను పేరే పెట్టుకోవడం విశేషం. గతంలో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలను తితిలీ, ఫణి, గులాబ్ తుఫానులు వణికించిన టైంలో వాటి పేర్లను కొందరు తమ పిల్లలకు పెట్టుకున్నారు.

Tags:    

Similar News