BREAKING: ఇండియా-చైనా బార్డర్‌లో భారీగా బంగారం పట్టివేత
ఇండియా-చైనా బార్డర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. లడక్ నుండి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు మంగళవారం కొందరు దుండగులు
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-చైనా బార్డర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. లడక్ నుండి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు మంగళవారం కొందరు దుండగులు ప్రయత్నించారు. ఈ క్రమంలో చొరబాటుదారుల కుట్రను భగ్నం చేసిన ఇండో టిబెటిన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ).. వారి నుండి 108 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొ బిస్కెట్ బరువు కేజీ ఉన్నట్లు సమాచారం. బార్డర్ గుండా బంగారం తరలించి ఇండియాలో స్మగ్లింగ్ చేసే వ్యుహాంలో భాగంగానే ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. సరిహద్దులో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడిన నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.