రైల్లో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన రెండు బోగీలు

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ రాజధాని పాట్నా నుంచి జార్ఖండ్‌ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2024-06-06 18:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ రాజధాని పాట్నా నుంచి జార్ఖండ్‌ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి బిహార్‌లోని లఖిసరాయ్‌ రైల్వే జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. తొలుత ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు మరిన్ని బోగీలకు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఎంతమందికి గాయాలయ్యాయి? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారంకల్లా దీనిపై అధికారిక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. 

Similar News