Manipur Police : పోలీసులపై దాడికి దిగితే ఖబడ్దార్ : మణిపూర్ పోలీసు శాఖ

దిశ, నేషనల్ బ్యూరో : తుపాకులు, ఇతరత్రా సాయుధ సామగ్రితో పోలీసులపై దాడులకు తెగబడే వారిని ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదని మణిపూర్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-09-15 17:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తుపాకులు, ఇతరత్రా సాయుధ సామగ్రితో పోలీసులపై దాడులకు తెగబడే వారిని ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదని మణిపూర్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిని అల్లరిమూకలుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కక్వా ప్రాంతంలో శని, ఆదివారాల్లో కొనసాగిన హింసాకాండను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఈ హెచ్చరికను జారీ చేశారు.

ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల ఎస్పీలకు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలపై తీవ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించిన విషయాన్ని మణిపూర్ పోలీసు శాఖ ఈసంందర్భంగా గుర్తుచేసింది. ఈవారం మొదట్లో ఇంఫాల్‌లో నిరసనకు దిగిన పలువురిపై పోలీసులు టియర్ గ్యాస్‌ షెల్స్‌ను ప్రయోగించారు.ఆసందర్భంగా ఓ మహిళ అస్వస్థతకు గురై, ఆమెకు అబార్షన్ జరిగింది. ఆ ఘటనను వ్యతిరేకిస్తూ శని, ఆదివారాల్లో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి.


Similar News