Mumbai: ముంబైలో ఓవర్‌టేక్ చేసినందుకు వ్యక్తిని కొట్టి చంపిన ఆటో రిక్షా డ్రైవర్

దిండోషిలో ఓవర్‌టేక్ చేయడంపై చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసింది.

Update: 2024-10-14 19:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని మలాడ్ ప్రాంతంలో రోడ్డుపై జరిగిన వివాదంలో కొందరు వ్యక్తులు యువకుడిని కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. గత శనివారం దిండోషిలో ఓవర్‌టేక్ చేయడంపై చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసింది. ఆకాశ్(27) యువకుడు దసరా పండుగ రోజున కొత్త కారు కొనేందుకు మలాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో అతని వాహనాన్ని ఆటో రిక్షా ఓవర్‌టేక్ చేసింది. దీనిపై యువకుడికి, రిక్షా డ్రైవర్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పి ఆటో రిక్షా డ్రైవర్ తన స్నేహితులతో కలిసి ఆకాశ్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆకాశ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశ్‌ను రక్షించేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి చేయిదాటిపోయింది. దీనికి సంబంధించి ఆటో రిక్షా డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. 

Tags:    

Similar News