అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్‌కు సెమీ ఫైనల్ కావు: మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు

త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2023-10-25 07:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రతి రాష్ట్రానికి వేరు వేరు ఎన్నికల సమస్యలు ఉన్నాయని వాటి ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వీటికి భిన్నమైనవని అభిప్రాయపడ్డారు. బుధవారం కర్నాటకలో మాట్లాడిన ఖర్గే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై వ్యతిరేకత ఉందని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లోటుతో ప్రజలు విసిగిపోయారన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం కర్నాటకను ఏటీఎంగా మలుచుకుంటోందన్న విమర్శలను ఆయన ఖండిచారు. ఎన్నికల కారణంగా తమ ప్రభుత్వ పరువును తీయడానికి ప్రయత్నిస్తున్నారని కానీ ప్రజలు దీనిని నమ్మరని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చిస్తామన్నారు. రథ్ ప్రభారీలుగా ప్రభుత్వ అధికారులను నియమించడం సరికాదని ప్రధానికి లేఖ రాశానన్నారు. పార్టీ కార్యక్రమాలకు గవర్నమెంట్ ఆఫీసర్లను వాడుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని ఇది మంచిపద్దతి కాదన్నారు. బీజేపీ తన పార్టీ కార్యక్రమాలకోసం వారి కార్యకర్తలను వాడుకోవాలన్నారు.  

Tags:    

Similar News