మహారాష్ట్ర ధైర్యాన్ని ఎన్నికల్లో చూపిస్తాం: ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు

శివసేన(యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రజల ధైర్యాన్ని ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో చూస్తారని చెప్పారు.

Update: 2024-05-01 10:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శివసేన(యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర దోపిడీదారులకు రాష్ట్ర గర్వం, ధైర్యం ఏమిటో చూపిస్తామని చెప్పారు. బుధవారం మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించారు. అనంతరం దక్షిణ ముంబైలోని హుటాత్మా చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఎవరికీ బానిసలుగా ఉండనివ్వబోమని తేల్చి చెప్పారు. మహారాష్ట్రను దోచుకునే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అటువంటి చర్యలకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ గెలుపు ఖాయమని తెలిపారు. రెండు దశల్లో జరిగిన ఎన్నికలతోనే బీజేపీ ఓటమి ఖాయమైందని విమర్శించారు. కాగా,1960 మే 1 మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్రంలోని 48 సీట్లకు గాను శివసేన (యూబీటీ) 21, కాంగ్రెస్ 17, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ చంద్ర పవార్) 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

Tags:    

Similar News