Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ తొలి జాబితా రిలీజ్..99 మంది అభ్యర్థులకు చోటు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది.

Update: 2024-10-20 10:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. ఈ లిస్టులో 99 మంది పేర్లను ఖరారు చేసింది. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. అలాగే బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ స్థానం నుంచి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అంతేగాక మొదటి జాబితాలో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే, మంత్రులు గిరీష్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, అతుల్ సేవ్ వంటి ప్రముఖులకు కూడా అవకాశం దక్కింది. బవాన్‌కులే కమ్తీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. కొలాబా నుంచి అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, కంకావలి నుంచి నితీశ్ రాణేకు టికెట్ దక్కింది. కాగా, మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి కూటమిలో భాగస్వామిగా ఉన్న..బీజేపీ155, శివసేన షిండే వర్గం 78, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 55 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్టు తెలుస్తోంది. 


Similar News