మహారాష్ట్ర ఎన్నికలు.. రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఎన్డీయే(NDA) కూటమిలో ప్రధాన భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన(Jansena) పార్టీ ని బీజేపీ(BJP) పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది.
దిశ, వెబ్ డెస్క్: ఎన్డీయే(NDA) కూటమిలో ప్రధాన భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన(Jansena) పార్టీ ని బీజేపీ(BJP) పూర్తి స్థాయిలో వినియోగించుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తెలుగువారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పలుమార్లు ప్రచారంలోకి పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే కాకుండా.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharashtra Elections) పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను రంగంలోకి దింపేందుకు ఎన్డీయే(NDA) కూటమి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తెలుగు వారు అత్యధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 20 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.