ఎన్‌సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు శాఖల కేటాయింపు..

గతవారం మహారాష్ట్ర మంత్రివర్గంలోకి ప్రవేశించిన 9 మంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎమ్మెల్యేలకు శాఖలను కేటాయించారు.

Update: 2023-07-14 11:39 GMT

ముంబై : గతవారం మహారాష్ట్ర మంత్రివర్గంలోకి ప్రవేశించిన 9 మంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ఎమ్మెల్యేలకు శాఖలను కేటాయించారు. ఎన్‌సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్ధిక, ప్రణాళిక శాఖలు దక్కాయి. ఛగన్ భుజబల్‌కు ఫుడ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్‌ను కేటాయించారు. ధరమ్‌రావు బాబా ఆత్రంకు డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) శాఖ, దిలీప్ వాల్సే పాటిల్‌కు సహకార శాఖ, ధనంజయ్ ముండేకు వ్యవసాయ శాఖ, హసన్ ముష్రిఫ్‌కు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌, అనిల్ పాటిల్‌కు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్‌, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ శాఖలు దక్కాయి.

సంజయ్ బన్సోడే కు క్రీడలు, యువజన సంక్షేమ శాఖలు, అదితి తత్కరే కు మహిళా, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు. కాగా, ఆర్థికమంత్రిగా అజిత్ పవార్ అయితే ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మరిన్ని వనరులు, ప్రాజెక్టులను కేటాయించి.. తమకు నిధులు రాకుండా చేస్తారని సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం శివసేన ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ విధంగా జరగకుండా చూస్తానని ఏక్ నాథ్ షిండే హామీ ఇవ్వడంతో ఆ ఎమ్మెల్యేలు శాంతించారని అంటున్నారు.


Similar News