Eknath Shinde : నిరుద్యోగుల కోసం ‘లాడ్లా భాయ్ యోజన’

దిశ, నేషనల్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఓ జనాకర్షక పథకాన్ని ప్రకటించారు.

Update: 2024-07-17 18:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఓ జనాకర్షక పథకాన్ని ప్రకటించారు. దాని పేరు.. లాడ్లా భాయ్ యోజన. ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన అని కూడా ఈ స్కీంను పిలువనున్నారు. ఇది నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌. దీని ద్వారా నిరుద్యోగ యువతకు విద్యార్హతలను బట్టి నెల నెలా బ్యాంకు అకౌంట్లలో స్టయిఫండ్‌ను అందిస్తారు.

18-35 ఏళ్ల వయసు గల మహారాష్ట్ర నివాసితులు ఈ స్కీంకు అర్హులు. 12 తరగతి పాసైన వారు, డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారు దీనికి అప్లై చేయొచ్చు. లాడ్లా భాయ్ యోజనకు ఎంపికయ్యే వారికి ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఈ వ్యవధిలో వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. 12వ తరగతి పాసైన వారికి ప్రతినెలా రూ.6వేలు, ఐటీఐ/ డిప్లొమా పూర్తి చేసిన వారికి ప్రతినెలా రూ.8 వేలు, డిగ్రీ/పీజీ పూర్తి చేసిన వారికి ప్రతినెలా రూ.10 వేలు చొప్పున అందిస్తారు. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ అందించడంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడం ఈ పథకం ముఖ్య లక్ష్యం.

Tags:    

Similar News