ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతి దారుల జాబితా విడుదల

ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుల జాబితాను స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసింది.

Update: 2023-03-14 04:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుల జాబితాను స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2018 నుంచి 2022 మధ్య కాలంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతి దారుగా ఉంది. భారత్ తో పాటు.. సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా. చైనా కూడా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో.. ఈజిప్ట్, దక్షిణ కొరియా, పాకిస్తాన్, జపాన్, అమెరికా ఉన్నాయి. కాగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆయుధాల దిగుమతుల్లో కేవలం భారత్ మాత్రమే.. 11% వాటాను కలిగి ఉందని SIPRI నివేదిక పేర్కొంది.

 

Tags:    

Similar News