Viral news: ఒకే చోట వేలాది ఎలుగు బంట్లు.. భయాంకరమైన అరుదైన దృశ్యం!
సాధారణంగా సఫారీలకు వెళ్లినప్పుడు మనకు ఒకే చోట పదుల సంఖ్యలో సింహాలు, పులులు, జింకలు, ఏనుగులు, ఎలుగుబంట్లు కనిపిస్తుంటాయి.
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా సఫారీలకు వెళ్లినప్పుడు మనకు ఒకే చోట పదుల సంఖ్యలో సింహాలు, పులులు, జింకలు, ఏనుగులు, ఎలుగుబంట్లు కనిపిస్తుంటాయి. కానీ, రోడ్డుపై ఒకేసారి వేలాదిగా వన్య ప్రాణులు ప్రత్యేక్షమైతే ఆ దృశ్యం చూసేందుకు ఎంత భయాంకరంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో అలాంటి ఓ ఫొటో వైరల్‌గా మారింది.
అమెరికాలో ఎల్లో స్టోన్ నేషనల్ పార్కులో (Yellowstone National Park) ఈ అరుదైన అద్భుత ఘటన చోటుచేసుకుంది. పార్కుకు వెళ్లే ప్రవేశ ద్వారం రోడ్డుపై వేలాదిగా ఎలుగుబంట్లు (Bears) ప్రత్యేక్షమయ్యాయి. దీంతో ఏదో పెద్ద విపత్తు రాబోతుందని, శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేని ఆ విషయాన్ని ఎలుగుబంట్లు ముందే కనిపెట్టి ఇలా ఒక్కచోటుకి చేరాయంటూ నెట్టింట వార్తలు వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది ఫేక్ ఫొటో అని, మరికొంత మంది చూసేందుకు అద్భుతంగా ఉందని, అవి అడవిని కాపాడేందుకు నిరసన తెలుపుతున్నట్లుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే, అసలు విషయమేమింటటే.. ఈ ఫొటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) వినియోగించి క్రియేట్ చేసినట్లు తేలింది. అలాగే, ఈ ఘటనకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాకపోవటంతో ఇది ఫేక్ న్యూస్ తేలింది.
కాగా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి ఫేక్ వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది తమకు నచ్చినట్లుగా ఫొటోలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు ఇలాంటి వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తున్నారు.
Read More..
Fashion Week: మేము చేయగలం.. ఫ్యాషన్ షోలో రోబోల సందడి.. క్యాట్ వాక్, పల్టీలు సైతం