Lebanon: లెబనాన్‌ను వెంటనే వీడండి..భారతీయులకు మరోసారి ఎంబసీ సూచన

హమాస్ అగ్రనేతల హత్యల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం మరోసారి తమ పౌరులకు సలహాను జారీ చేసింది.

Update: 2024-08-01 12:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ అగ్రనేతల హత్యల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం మరోసారి తమ పౌరులకు సలహాను జారీ చేసింది. వెంటనే లెబనాన్ ను వీడాలని స్పష్టం చేసింది. అంతేగాక భారత్ నుంచి సైతం లెబనాన్‌కు రావొద్దని సూచించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు లెబనాన్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా లెబనాన్‌ను విడిచివెళ్లాలని, ఒకవేళ ఏదైనా కారణంచేత ఇక్కడే ఉండాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

అత్యవసర టైంలో ID cons.beirut@mea.gov.in ఈమెయిల్ ద్వారా, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ +96176860128 ద్వారా బీరుట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. 48 గంటల్లో ఎంబసీ మూడో సారి అడ్వైజరీ జారీ చేయడం గమనార్హం. అంతకుముందు ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా దాడి చేసింది. దీంతో హిజ్బొల్లాపై ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో లెబనాన్‌లోని ఇండియన్ ఎంబసీ భారతీయులకు సలహా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హమాస్ చీఫ్ హనియా హత్యతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే మరోసారి భారతీయులకు పలు సూచనలు చేసింది.

Tags:    

Similar News