సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది అతడేనట

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పులకు బాధ్యత వహించాడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్.

Update: 2024-04-14 15:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పులకు బాధ్యత వహించాడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్. కాల్పులు జరిపిన తర్వతా దానికి బాధ్యత వహిస్తూ అన్మోల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అన్మోల్ భారత్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఆయన అమెరికాలో తలదాచుకున్నట్లు సమాచారం.

కాగా అన్మోల్.. సల్మాన్ కు హెచ్చరికలు జారీ చేస్తూ.. కాల్పులు జరపడం ఓ ట్రైలర్ మాత్రమే అని పేర్కొన్నాడు. మాకు శాంతి కావాలని..అణచివేతకు వ్యతిరేకంగా ఒక్క నిర్ణం యుద్ధం అయితే.. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్మోల్ రాసుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ కు మా బలం ఏంటో తెల్సేందుకు ఇదో ట్రైలర్ మాత్రమే అని అన్నాడు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని అన్నాడు. ఇక ఇంటిబయట కాల్పులు జరపబోమని హెచ్చరించారు. మీరు దేవుళ్లుగా భావించే దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ పేర్లతో ఉన్న కుక్కలు ఉన్నాయని మండిపడ్డారు. తనకు ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదని పోస్ట్ లో రాసుకొచ్చాడు.

సల్మాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్‌ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ముందు ఈ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

గత ఏడాది మార్చిలో సల్మాన్‌ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబయి పోలీసులు.. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీరు టార్గెట్‌ చేసిన జాబితాలో సల్మాన్‌ పేరున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్‌ బిష్ణోయ్‌ అన్నాడు. ఇదే విషయంపై ఆయనకు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2023 ఏప్రిల్‌లోనూ ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది.


Similar News