లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టం: Devendra Fadnavis

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రభుత్వం లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు

Update: 2022-12-09 14:23 GMT

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రభుత్వం లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. శ్రద్ధా వాకర్ తండ్రితో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ఏ చట్టాలు ఉన్నాయో పరిశీలిస్తున్నామని చెప్పారు. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

దేశంలో బలవంతపు మతమార్పిడులు చట్టవిరుద్ధమని తెలిసిందే. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లవ్ జిహాద్‌ను ఎదుర్కొనేందుకు చట్టాన్ని తీసుకొచ్చాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అంతకుముందు అసోం సీఎం హిమంత బిస్వ శర్వ కూడా లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని తేవాల్సిన అవసరముందని అన్నారు. ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమ పేరుతో మత మార్పిడికి ఆకర్షించడాన్నే లవ్ జిహాద్‌గా బీజేపీ పేర్కొంటుంది.

Tags:    

Similar News