జూన్ నెల హాటెస్ట్ మంత్.. 174 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత : NASA

గత జూన్ నెల హాటెస్ట్ మంత్‌గా రికార్డు నెలకొల్పింది.

Update: 2023-07-14 13:46 GMT

న్యూఢిల్లీ: గత జూన్ నెల హాటెస్ట్ మంత్‌గా రికార్డు నెలకొల్పింది. ఒక నెలలో ఇంత వేడి రికార్డు కావడం గత 174 ఏళ్లలో ఇదే మొదటి సారి అని నాసా, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) శాస్త్రవేత్తలు తెలిపారు. వారి విశ్లేషణ ప్రకారం.. ఎల్‌నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు చాలా వేడిగా మారుతున్నాయి. దీంతో పసిఫిక్ మహా సముద్రంలో నీరు సాధారణం కంటే ఎక్కువ వేడిని కలిగి ఉంది. అదనపు వేడి ప్రపంచ వ్యాప్తంగా వాతావరణాన్ని మారుస్తోంది.

ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచుతోంది. జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రత 1991-2020 మధ్య కాలంలో సగటున 15.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. మేలో ప్రారంభమైన ఎల్‌నినో జూన్ నెలలో బలపడటం వల్లే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భూమధ్య రేఖ, పసిఫిక్ మహా సముద్రంలో ఎక్కువగా నమోదయ్యాయి.


Similar News