Kolkata Rape Case: అమ్మాయి చనిపోతే నీకు నవ్వొస్తోందా?.. తీవ్ర ఆగ్రహంతో చివాట్లు పెట్టిన జడ్జి

కలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమ్ము దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-24 02:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమ్ము దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి దాదాపు 15 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదు. దీంతో నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ప్రజలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇక నిందితుడు సంజయ్ రాయ్‌కు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. కలకత్తా అత్యాచార ఘటనలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరఫు వాదిస్తున్న ప్రముఖ లాయర్ కపిల్ సిబాల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ పక్క సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫు వాదిస్తూ కలకత్తా పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేసారని విచారణలో లోటుపాట్లు ఉన్నాయని అన్నారు. దీనికి కపిల్ సిబాల్ సమాధానం ఇవ్వకుండా నవ్వారు. దీంతో తుషార్ మెహతాతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మండిపడ్డారు. ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. అలాంటి ఈ సమయంలో నీకు నవ్వొస్తుందా అని చివాట్లు పెట్టారు. ఆ తర్వాత సిబాల్ సారీ చెబుతూ తన వాదనలు వినిపించగా.. కలకత్తా పోలీసులకు సమన్లు జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 5 కి వాయిదా వేశారు.


Similar News