Chinese Encroachment : మ్యాపుల్లో పెయింటింగ్స్ ఉంటే.. చైైనా కబ్జా చేసినట్టా ? : భారత్

దిశ, నేషనల్ బ్యూరో : అరుణాచల్‌ప్రదేశ్‌‌లోని అంజ్వా జిల్లా సరిహద్దు ప్రాంతంలోకి చైనా ఆర్మీ చొరబడిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు.

Update: 2024-09-09 17:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అరుణాచల్‌ప్రదేశ్‌‌లోని అంజ్వా జిల్లా సరిహద్దు ప్రాంతంలోకి చైనా ఆర్మీ చొరబడిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. అంజ్వా జిల్లాలోని కపపు ప్రాంతంలో కొన్ని రోజుల పాటు చైనా ఆర్మీ క్యాంపును నిర్వహించిందంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అరుణాచల్ సరిహద్దు ప్రాంతాల మ్యాపుల్లో కొన్నిచోట్ల పెయింటింగ్స్ వేసి, అవి కబ్జాకు గురయ్యాయని వాదించడం సరికాదన్నారు.

అలాంటి వాదనల్లో వాస్తవికత లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలోని భూభాగాల్లో భారత సైన్యం నిత్యం పెట్రోలింగ్ చేస్తుంటుందని, వాటిని చైనా ఆక్రమించుకోలేదని రిజిజు తెలిపారు. సరిహద్దు భూభాగాల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టే అనుమతి చైనాకు ఉండదన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) సమీపంలోకి ఎవరినీ రానిచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే అంశంపై ప్రస్తుతం భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. 


Similar News