Miss Teen Universe 2024: మిస్ టీన్ యునివర్స్ 2024 గా ఒడిశా అమ్మాయి.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే

మిస్ టీన్ యునివర్స్ 2024 కిరీటాన్ని ఒడిశా అమ్మాయి దక్కించుకున్నారు.

Update: 2024-11-12 12:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ అందాల పోటీలో భారత్ మరోసారి సత్తా చాటింది. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ వేదికగా జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024 (Miss Teen Universe 2024) పోటీల్లో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల తృష్ణా రే (Trishna Ray) ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి 9 వరకు జరిగిన ఈ కిరీటం కోసం పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నమీబియా, నెదర్లాండ్స్ సహా వివిధ దేశాలకు చెందిన మోడళ్లు పోటీపడ్డారు. కానీ వీరందరినీ వెనక్కి నెట్టిన తృష్ణారే ఆ టైటిల్ ను తన సొంతం చేసుకున్నారు. ఆమె తర్వాత పేరూకు చెందిన అన్నే థోర్సెన్, నమీబియాకు చెందిన ఫ్రెషియస్ ఆండ్రీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా ఈ కేటగిరీలో భారత్ అమ్మాయి విజేతగా నిలవడం ఇదే తొలిసారి.

ఆర్మీ అధికారి కూతురే ఈ తృష్ణా రే:

తృష్ణా రే కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రేల కుమార్తె. ఈమెది ఒడిశా (Odisha) రాష్ట్రం కాగా ప్రస్తుతం ఈ భామ భువనేశ్వర్ లోని కేఐఐటీ యూనివర్సిటీ (kiit university) లో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. గతేడాది ఏప్రిల్ 1న జరిగిన మిస్ టీన్ యూనివర్సిటీ ఇండియా పోటీల్లో తృష్ణా రే విజేతగా నిలిచి భారత్ తరపున ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆమె అర్హత సాధించి ఏకంగా టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు సంబంధించిన వీడియోను నిర్వహాకులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా తృష్టారేకు పలువురు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ మె గెలుపు దేశానికి గర్వకారణం అని ఆమె చదువుతున్న కేఐఐటీ ఇన్స్టిట్యూట్ తన అధికారిక వెబ్ సైట్ లో పోస్టు చేసింది. 

Full View

Tags:    

Similar News