సోషల్ మీడియా రూమర్స్ వల్ల కేరళ తొలి ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య..

ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లు సోషల్ మీడియాలో వారిద్దరు విడిపోతున్నారని పుకార్లు రావడంతో ఆత్మహత్య చేసుకొని మరణించారు.

Update: 2023-05-05 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లు.. సోషల్ మీడియాలో వారిద్దరు విడిపోతున్నారని పుకార్లు రావడంతో ఒకరు మరణించగా..  మరొకరు ఆత్మహత్మయత్నానికి పాల్పడ్డారు.  వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన బాడీబిల్డర్ ప్రవీణ్ నాథ్ 2021లో ట్రాన్స్ జెండర్ విభాగంలో మిస్టర్ కేరళ పోటీలో విజయం సాధించాడు. 2022లో జరిగిన ఇంటర్‌నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ లిస్టులో పేరు సంపాదించుకున్నాడు. ఈ ఏడాదిలోనే అతడు లింగమార్పిడి సర్జరీ చేయించుకున్నాడు.

అలాగే ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం రోజున మరో ట్రాన్స్ జెండర్ రిషానా ఐషును పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. వీరిద్దరు వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం కావడంతతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. ఈ బాధని తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన ప్రవీణ్ భార్య కూడా సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో ట్రీట్‌మెంట్ పొందుతుంది. కాగా ప్రవీణ్ మరణానికి సోషల్ మీడియానే కారణమని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సీఎం డీజీపీకి ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News