‘కేరళ’ కాదు.. ‘కేరళం’!

కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఆరాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్‌ సభలో సోమవారం ప్రవేశపెట్టారు.

Update: 2024-06-24 15:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఆరాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్‌ సభలో సోమవారం ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపింది. దీంతో ఆ తీర్మానం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. కాకపోతే, సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్షాలు కొన్ని సవరణలను ప్రతిపాదించాయి. పేరు మార్పున‌కు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వ‌ర‌లో కేంద్రానికి పంప‌నున్నారు.

గతంలో ఈ తీర్మానాన్ని తిరస్కరించిన కేంద్రం

గతేడాది ఆగస్టు 9న కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ప్ర‌కారం కేర‌ళ పేరును కేర‌ళంగా మార్చాల‌ని కేంద్రాన్ని కోరారు. అయితే ఈ డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని కేరళప్రభుత్వం కేంద్రానికి పంపింది.


Similar News