ఇండియా, ఎన్డీఏ కూటమికి వచ్చే MP సీట్లు ఎన్నో తేల్చిచెప్పిన CM కేజ్రీవాల్

దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి వరకు ఆరు ఫేజ్‌ల

Update: 2024-05-29 13:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి వరకు ఆరు ఫేజ్‌ల పోలింగ్ పూర్తి అయ్యింది. జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. జూన్ 4వ తేదీన దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్నా ఉత్కంఠకు తెర దిగనుంది. ఈ క్రమంలో ఎన్డీఏ, ఇండియా కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 400 సీట్లు సాధించి హ్యాట్రిక్ కొడతామని బీజేపీ బలంగా ప్రచారం చేసుకుండగా.. ఈ సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి అంటోంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ఇండియా కూటమికి వచ్చే సీట్లు ఎన్నో కుండబద్దలు కొట్టారు. ఇండియా కూటమికి 300 సీట్లు, ఎన్డీఏ కూటమికి 200 సీట్లు వస్తాయని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. బీజేపీకి 400 సీట్లు వచ్చే ఛాన్సే లేదని ఈ సంద్భరంగా ఢిల్లీ సీఎం తేల్చి చెప్పారు. 


Similar News