Mohan Bhagwat: అహాన్ని పక్కన పెట్టకుంటే అగాధంలో పడిపోతాం

అందరూ అహాన్ని పక్కన పెట్టాలని లేదంటే అగాధంలో పడిపోతారని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ (RSS Chief Mohan Bhagwat) పిలుపునిచ్చారు.

Update: 2024-12-17 11:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అందరూ అహాన్ని పక్కన పెట్టాలని లేదంటే అగాధంలో పడిపోతారని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ (RSS Chief Mohan Bhagwat) పిలుపునిచ్చారు. శాశ్వతమైన ఆనందం, సంతృప్తిని గుర్తించినప్పుడే నిస్వార్థ సేవ చేయగలమని అన్నారు. దానివల్లే ఇతరులకు సహాయపడే ధోరణిని కూడా పెరుగుతందని అన్నారు. మహారాష్ట్రలోని(Maharashtra) పూ(Pune) జరిగిన భారత్ వికాస్ పరిషత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజంలో ప్రతిదీ తప్పుగానే జరుగుతుందనే అభిప్రాయం పెరుగుతోందని అన్నారు. "అయితే, ప్రతి ప్రతికూల అంశానికి సమాజంలో 40 రెట్లు ఎక్కువ మంచి, ఉదాత్తమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సానుకూల ప్రయత్నాల గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. ఎందుకంటే, సేవ అనేది సమాజంలో శాశ్వత నమ్మకాన్ని పెంపొందిస్తుంది" అని ఆయన అన్నారు.

రామకృష్ణ పరమహంస

“రామకృష్ణ పరమహంస అభిప్రాయం ప్రకారం.. మనలో రెండు ‘నేను’లు ఉంటాయి. ఒకటి ముడిపదార్థం కాగా, మరొకటి పరిపక్వత చెందినది. పరిపక్వతతో కాకుండా ముడిపదార్థం (ఇగోతోఉంటే)గానే ఉంటామంటే.. అగాధంలో పడిపోతాం’’ అని మోహన్ భగవత్ హితవు పలికారు. ప్రతి వ్యక్తిలో సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తినిచ్చే 'సర్వశక్తిమంతుడు' ఉంటాడని అన్నారు. అలానే అహం కూడా ఉంటుందని అన్నారు. అన్ని వర్గాల సాధికారతే దేశం అభివృద్ధిని నిర్ధారిస్తుందని తెలిపారు. దేశ పురోగతికి దోహదపడేలా యువతను తీర్చిదిద్దాలని సూచించారు. సమాజంలో అనేక మంచి కార్యక్రమాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News