Indigo International sale: విమాన ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్.. తక్కువ ధరకే ఇంటర్నేషనల్ జర్నీ..!
దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) విమాన ప్రయాణికులకు(Air Passengers) గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) విమాన ప్రయాణికులకు(Air Passengers) గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్నేషనల్ సేల్(International sale) పేరుతో ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 17వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 20, 2024 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ మేరకు 'ఎక్స్(X)' వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఈ ఆఫర్లో భాగంగా కస్టమర్లకు టికెట్ బుకింగ్స్(Ticket Bookings)పై డిస్కౌంట్లు(Discounts), యాడ్ ఆన్(Add-on) ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. కేవలం రూ. 4,499కే దుబాయ్(Dubai), సింగపూర్(Singapur) వంటి తదితర ఇంటర్నేషనల్ రూట్లలో విమాన ప్రయాణం కల్పిస్తోంది.
ఇక 6E యాడ్ ఆన్స్ స్టాండర్డ్ సీట్ వంటి వాటిపై 15 శాతం వరకు అదనపు డిస్కౌంట్, అలాగే రూ. 999కే ఎమర్జెన్సీ సీట్ ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)/ ఫెడరల్ బ్యాంక్(Federal Bank) క్రెడిట్, డెబిట్ కార్డులతో టికెట్ కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు సేవ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్ www.goindigo.in లేదా మొబైల్ యాప్/ వాట్సాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వరిస్తుందని ఇండిగో వెల్లడించింది. ఈ ఆఫర్ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకుని జనవరి 1, 2025 నుంచి మే 31, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని తెలిపింది.