Karnataka: సీఎం సిద్ధరామయ్య సభలో గందరగోళం

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah) సభలో గందరగోళం జరిగింది. సభ జరుగుతుండగా భద్రతా సిబ్బందిని దాటి స్టేజీపైకి వెళ్లేందుకు అగంతకుడు యత్నించాడు.

Update: 2024-09-15 08:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah) సభలో గందరగోళం జరిగింది. సభ జరుగుతుండగా భద్రతా సిబ్బందిని దాటి స్టేజీపైకి వెళ్లేందుకు అగంతకుడు యత్నించాడు. దీంతో, స్టేజీ దగ్గరే ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో(Karnataka Assembly premises) ప్రజాస్వామ్య దినోత్సవం(Democracy Day event) నిర్వహిస్తుండగా.. భద్రతా వైఫల్యం(Security breach) జరిగింది. సెక్యూరిటీని తప్పించుకుని స్టేజ్ పైకి వెళ్లడానికి వ్యక్తి సాహసం చేశాడు. అయితే, ఆ వ్యక్తి వేదికపైకి రాకముందే పోలీసు అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మాత్రం.. నిందితుడు సీఎం సిద్ధరామయ్య అభిమాని అని, శాలువతో సత్కరించాలని స్టేజీ వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా,సీఎం సభలో భద్రతా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, అగంతకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అతను ఎవరు? ఏం చేస్తుంటారు? సభలో గందరగోళం సృష్టించేందుకు ఎందుకు యత్నించాడు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Similar News