US presidential Election: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఖరారు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US presidential Election) డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమలాహ్యారిస్ ఖరారయ్యారు. డొనాల్డ్‌ ట్రంప్‌ తో ఆమె పోటీ పడబోతున్నారు.

Update: 2024-08-03 04:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US presidential Election) డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమలాహ్యారిస్ ఖరారయ్యారు. నవంబర్‌ 7న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తో ఆమె పోటీ పడబోతున్నారు. అయితే, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చ్‌వల్‌ రోల్‌ కాల్‌లో కమలా సాధించారు. ఈ విషయాన్ని డెమొక్రటిక్‌ నేషనల్‌ కమిటీ ఛైర్‌ జేమ్‌ హరిసన్‌ ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్ష నామినీగా ఆమె పేరు ప్రకటించడం ఒకటే మిగిలింది. డెలిగేట్‌ల ఓటింగ్‌ ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కమలా మెజారిటీ ఓట్లను పొందినట్లు జేమ్‌ హరిసన్‌ పేర్కొన్నారు. చికాగోలో ఈనెల చివరాఖరున జరగనున్న కన్వెన్షన్‌లో కమలా హారిస్‌ కోసం ర్యాలీ చేపట్టి తమ బలం ప్రదర్శిస్తామని హరిసన్‌ తెలిపారు. పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు డెమొక్రాట్ల ప్రతినిధులు ఈ మెయిల్‌ ద్వారా ఓటింగ్‌ వేశారు. మరోవైపు తన ఉపాధ్యక్ష అభ్యర్థి పేరుని కమలా హారిస్‌ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆగస్టు 7తో అధికారిక నామినేషన్ ఖరారు కానుంది. నామినేషన్‌ కోసం ఇప్పటివరకు ఆమెకు పోటీలో దారిదాపుగా ఎవరూ లేరు.

కమలా హ్యారిస్ ఏమన్నారంటే?

డెమొక్రటిక్‌ అభ్యర్థిగా ఖరారు కావడంతపై కమలా హారిస్‌ స్పందించారు. ‘‘డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. దేశం పట్ల ప్రేమతో, ఐక్యంగా దేశం కోసం పోరాడే వ్యక్తులను ఒక్కటి చేయడమే నా ప్రచారం ఉద్దేశం. వర్చువల్‌ ఓటింగ్‌ సమయం ముగిశాక అధ్యక్ష నామినేషన్‌ను అధికారికంగా అంగీకరిస్తాను’’ అని కమలా పేర్కొన్నారు. ఈ నెలలో చికాగోలో మేము సమావేశం అవుతాం. అందరం ఒక్కపార్టీగా నిలబడి పోరాడతామని అన్నారు.


Similar News