US Elections: పోల్ సర్వేలో ముందజంలో కమలా హ్యారిస్

ప్రపంచ దేశాల దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. అయితే, అగ్రరాజ్య ఎన్నికలపై పలు సంస్థలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి.

Update: 2024-08-05 07:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ దేశాల దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. అయితే, అగ్రరాజ్య ఎన్నికలపై పలు సంస్థలు సర్వేలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇటీవలే ప్రఖ్యాత సీబీఎస్ న్యూస్ విడుదల చేసిన సర్వే అందరిని ఆకర్షిస్తుంది. ఈ పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ దూకుడు మీదు ఉన్నట్లు గాతెలిపింది. ట్రంప్ కంటే ఆవిడే ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీ ఉండనున్నట్లు తెలిపింది. నవంబర్‌ 5న ఎన్నికలు జరగనుండగా రిపబ్లిక్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయి. భూరి విరాళాలు కూడా వచ్చాయి. అయితే, ఆమె రన్నింగ్ మేట్ ఎవరనేది కా తెలియరాలేదు. త్వరలోనే ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించనున్నారు.

కమలా హ్యారిస్ కు మద్దతు

కమలా హ్యారిస్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ మద్దతు పలికారు. ఈ విషయాన్ని ఆయన మనవడు జాసన్‌ మీడియాకు తెలిపారు. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లీ ఆదివారం వాషింగ్టన్‌లో హారిస్‌ను కలిసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గత నెలలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. దీంతో ట్రంప్ గెలుపునకు అవకాశాలుక పెరిగినట్లు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన నిర్వహించిన ర్యాలీల్లో కమలా హ్యారిస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయనపై విమర్శలు వచ్చాయి.


Similar News