Kailash Gehlot: అతిశికి భారీ షాకిచ్చిన ఆప్ నేత.. అవకతవకలు జరుగుతున్నాయంటూ రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోత్ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Update: 2024-11-17 08:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోత్ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఇక తన రాజీనామా విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన ఆయన.. అతిశీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతిశీ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వ్యక్తిగత రాజకీయ ఆశయాలు ప్రజల విషయంలో పార్టీ నిబద్ధతను సైతం అధిగమించాయని, అధికారిక నివాసానికి భారీగా నిధులు ఖర్చు చేయడాన్ని తప్పుబట్టిన ఆయన.. సామాన్యులుగా ఉండాలనుకొనే పార్టీ వైఖరిపై ఇలాంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కైలాష్ గెహ్లోత్‌కు ఆప్ పార్టీలో సీనియర్ నేతగా మంచి పేరుంది. అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపడతారనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. కానీ అనూహ్యంగా సీఎం సీటు అతిశీకి దక్కడంతో ఈయన సైడ్ లైన్ అయిపోయారు.


Read More..

Kailash Gahlot: ఆప్‌కు భారీ షాక్.. పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా  

Tags:    

Similar News