Jharkhand: జార్ఖండ్ బీజేపీ ఎంపీలపై కేసు
రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై శనివారం కేసు నమోదైంది. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ విమానాశ్రయంలో వీరు తమ చార్టెడ్ ఫ్లైట్‌ను టేకాఫ్ చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు వచ్చాయి.
రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై శనివారం కేసు నమోదైంది. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ విమానాశ్రయంలో వీరు తమ చార్టెడ్ ఫ్లైట్‌ను టేకాఫ్ చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరు ఎంపీలతోపాటు మరో 9 మంది పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో ఉన్న జార్ఖండ్‌లో ఈ తాజా పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జులైలో దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
అయితే సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని నిబంధన ఉంది. కానీ బీజేపీ ఎంపీలు అవేవీ పట్టించుకోకుండా ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లో బలవంతంగా ప్రవేశించారు. తమ చార్టెడ్ ఫ్లైట్ క్లియరెన్స్‌కు అనుమతి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. అనంతరం వారి విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటన ఆగస్టు 31న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీ నిశికాంత్ దూబెకు దేవ్‌ఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్‌కు మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం జరిగింది.
జాతీయ భద్రతా నియమాలను బీజేపీ ఎంపీ ఉల్లంఘించారంటూ మంజునాథ్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ ఫిర్యాదు చేయగా.. మరో వైపు ఎంపీ నిశికాంత్ కూడా మంజునాథ్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం హేమంత్ సోరెల్ ఆరోపించారు.