జార్ఖండ్ సీఎం Hemanth Soren కు బిగ్ షాక్!
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఈసీ సిఫారసుతో హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహరంలో సీఎం హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై అనర్హత వేటు కోసం ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బియాస్ అభిప్రాయం కోరుతూ గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల నియమావళిని సీఎం హేమంత్ సోరెన్ ఉల్లింఘించి తనకు తానుగా గనులు కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఈసీ నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
తాజా ఆరోణల నేపథ్యంలో శుక్రవారం సీఎం హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్ది సేపటికే ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై జేఎంఎం పార్టీ బీజేపీపై ఆరోపణలు చేస్తోంది. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్రగా అభివర్ణించింది. ఒక వేళ సోరెన్ అనర్హతకు గురైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జేఎంఎం ఇప్పటికే ప్రకటించింది.
జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి పూర్తి మెజారిటీ ఉందని, తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని జేఎంఎం పేర్కొంది. ఈ పరిణామల నేపథ్యంలో సోరెన్ సీఎం పదవి కోల్పోవాల్సి వస్తే తన భార్య కల్పనకు ఆ బాధ్యతలు అప్పగించే విషయంలో ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ స్పందించింది. ఈసీ నిర్ణయం ఏదైనా స్వాగతిస్తామని అయితే మొదటి నుండి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించించింది. తాజా పరిణామాలతో జార్ఖండ్ రాజకీయం హీటెక్కింది.