జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ సీట్ల పంపకాలు ఖరారు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి.

Update: 2024-10-18 09:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. మొత్తం 81స్థానాల్లో బీజేపీ 68స్థానాల్లో పోటీ చేయనుంది. అల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్ యూ)10 స్థానాల్లో పోటీ చేయనుండగా, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)కి 2 సీట్లు ఇచ్చారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ (ఎలే జేపీ)కి చత్రా సీటును కేటాయించారు. మిత్ర పక్షాల మధ్య సీట్ల పంపకం ఖరారైనందునా, వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ఏజేఎస్ యూ

సిల్లి, రామ్ ఘర్, గోమియా, ఇచాగర్, మండూ, జుగ్సాలియా, డుమ్రీ, పాకుర్, లోహర్ దగా, మనోహర్ పూర్ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జేడీయూ జంషెడ్ పూర్ వెస్ట్, తమర్ స్థానాల్లో పోటీ చేయనుంది. చత్రా నుంచి ఎల్జేపీ అభ్యర్థి పోటీ చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, అల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని కేంద్ర మంత్రి, జార్ఖండ్ బీజేపీ ఎన్నికల ఇంచార్జీ శివరాజ్ సింగ్ చౌహాన్ పునరుద్ఘాటించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ ఎన్నికలు జరుగుతాయని అస్సాం ముఖ్యమంత్రి, జార్ఖండ్ బీజేపీ ఎన్నికల కో-ఇంచార్జీ హేమంత్ బిస్వా శర్మ అన్నారు.

జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 20న 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 23న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగనుంది. 


Similar News