Jaishankar: శాంతి నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నం.. విదేశాంగ మంత్రి జైశంకర్

రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ వివాదాలకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ప్రయత్నిస్తోందని జైశంకర్ చెప్పారు.

Update: 2024-11-03 15:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukrein), పశ్చిమాసియా(Middle East)లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) వివాదాలకు దౌత్యం ద్వారా శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ ప్రయత్నిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai Shanker) నొక్కి చెప్పారు. ప్రతి సందర్భంలోనూ ఇరు పక్షాలతో మాట్లాడగలిగే కొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందని తెలిపారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం(brisbane city) లో భారతీయ కమ్యూనిటీ(Indian community) సభ్యులతో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రెండు వివాదాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఈ ఘర్షణల వల్ల గ్లోబల్ సౌత్‌లోని 125 దేశాలు ఎంతో బాధను అనుభవిస్తున్నాయన్నారు.

రష్యా-ఉక్రెయిన్ వివాదంలో దౌత్యం నెలకొల్పేందుకు తీవ్రమైన ప్రయత్నం జరగాలని అభిప్రాయపడ్డారు. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రధాని మోడీ (Pm modi) చొరవ తీసుకున్నారని, అందులో భాగంగా రష్యా, ఉక్రెయిన్‌లను సందర్శించినట్టు తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉందని ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకోలేకపోవడం ఇక్కడ అతి పెద్ద సమస్యగా ఉందన్నారు. కాబట్టి వివిధ దేశాలు దౌత్యానికి ప్రయత్నిస్తున్నాయని వారిలో భారత్ ఒకరిగా ఉంటుందని నొక్కి చెప్పారు.

Tags:    

Similar News