జైళ్లు నిండిపోతున్నాయ్.. న్యాయస్థానాలు విచారణలు వేగవంతం చేయాలి: సుప్రీంకోర్టు

జైళ్లు నిండిపోవడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానాలు విచారణ వేగవంతం... Jails overcrowded, courts should ensure that trials are taken up and concluded speedily: SC

Update: 2023-04-01 15:58 GMT

న్యూఢిల్లీ: జైళ్లు నిండిపోవడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానాలు విచారణ వేగవంతం చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ‘జైళ్లు కిక్కిరిసి ఉన్నాయని పేర్కొంటూ.. వారి జీవన పరిస్థితులు భయానకంగా ఉన్నాయని తెలిపింది. ప్రత్యేక చట్టాలు కఠినమైన నిబంధనలను రూపొందించే కేసులలో విచారణలను త్వరగా చేపట్టి, త్వరగా ముగించేలా చూడాలని సుప్రీం కోర్టు పేర్కొంది. విచారణలు నిర్దేశించిన సమయంలో జరగకపోతే వ్యక్తికి జరిగే అన్యాయం కొలవలేనిదని వ్యాఖ్యానించింది. ఓ కేసులో బెయిల్ విషయమై జస్టిస్ రవీంద్ర భట్, దీపాంకర్ దత్తాల బెంచ్ పరీశీలనకు వచ్చింది. ప్రత్యేకించి ప్రత్యేక చట్టాలు కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చిన సందర్భాల్లో త్వరగా విచారణ చేపడుతారని బెంచ్ తెలిపింది. కేంద్ర హోం శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం 2021 డిసెంబర్ 31 వరకు దేశంలో 4,25,069 ఖైదీల సామర్ధ్యం ఉండగా, 5,54,034 మంది ఖైదీలు ఉన్నారని తెలిపింది. వీరిలో 1,22,852 మంది దోషులు కాగా, 4,27,165 మంది విచారణను ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News