జైలు శిక్షా..? ఐ డోంట్ కేర్: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Update: 2023-03-25 07:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హత వేటు పడిన అనంతరం ఇవాళ రాహుల్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను బీజేపీని ఒకటే ప్రశ్న అడిగానని.. అదానీ షెల్ కంపెనీలలో 20 వేల కోట్ల పెట్టుబడులు ఎవరు పెట్టారని.. ఆ 20 వేల కోట్లు ఎవరివి అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంలో తాను పార్లమెంట్‌కు సాక్ష్యాలు సమర్పించానని తెలిపారు.

అయినప్పటికీ లోక్ సభలో కావాలనే నా ప్రసంగాన్ని తొలగించారని అన్నారు. పార్లమెంట్‌లో తన గురించి కేంద్రమంత్రులు పచ్చి అబద్ధాలు చెప్పారని.. అంతేకాకుండా తన లండన్ ప్రసంగంపై కూడా మంత్రులు తప్పుడు ప్రచారం చేశారని అరోపించారు. మంత్రుల ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోరారని.. అప్పుడు స్పీకర్ నవ్వి మాట్లాడే అవకాశం రాదని తనతో చెప్పారన్నారు. బీజేపీ ఎన్ని చేసిన తాను మాత్రం ప్రశ్నించడం మాననని తేల్చి చెప్పారు. జైలు శిక్షా.. ఐ డోంట్ కేర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

బిగ్ న్యూస్: జైలుకెళ్లేందుకు సిద్ధమవుతోన్న రాహుల్.. ఇవాళ మధ్యాహ్నం సంచలన ప్రకటన..?

Tags:    

Similar News