వీడిన ఉత్కంఠ.. 46 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు జగన్నాథుడి రత్న భాండాగారం రీ ఓపెన్

ఒడిషాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథాలయంలోని రత్నభాండారం ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది. 46 ఏళ్ల తర్వాత భాండాగారాంలోని రహస్య

Update: 2024-07-14 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథాలయంలోని రత్నభాండారం ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది. 46 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత భాండాగారాంలోని రహస్య గదిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల బృందం ఆదివారం తెరిచింది. 1978 తర్వాత పూరీ ఆలయంలో భాండాగారాన్ని మరోసారి తెరిచినట్లు ఒడిషా సీఎంవో అధికారికంగా వెల్లడించింది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్న భాండారాన్ని అధికారులు తెరిచారు. సీక్రెట్ రూమ్ నుండి నిధిని తరలించేందుకు చెక్క పెట్టేలు సిద్ధం చేశారు. రత్న భాండాగారంలోని సంపదను మరోచోటకు తరలించి పటిష్ట భద్రత నడుమ లెక్కించనున్నట్లు తెలుస్తోంది.

లెక్కింపు వివరాల నమోదును ఒడిషా ప్రభుత్వం డిజిటైలేజేషన్ చేయిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. 46 ఇయర్స్ తర్వాత రహస్య గది తెరుస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జగన్నాథుని రత్న భాండాగారం చివరిసారిగా 1978లో ఓపెన్ చేయగా.. సంపదను లెక్కించేందుకు అప్పుడు 70 రోజులు పట్టింది. నాటి జాబితా ప్రకారం సీక్రెట్ రూమ్‌లో 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి వీటితో పాటు విలువైన రాళ్లు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ఈ సారి లెక్కింపు తర్వాతే ఆభరణాల మొత్తం విలువపై ఒక అంచనాకు వ


Similar News