సిరియాపై ఇజ్రాయెల్ దాడి, ఐదుగురు మృతి
ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల్లో చాలా మంది పాలస్తీయన్లు చనిపోయారు. తాజాగా సిరియాపై కూడా దాడికి పాల్పడింది ఇజ్రాయెల్.
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడుల్లో చాలా మంది పాలస్తీయన్లు చనిపోయారు. తాజాగా సిరియాపై కూడా దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. సిరియా రాజధాని డమాస్కస్ లో జరిగిన దాడిలో ఐదుగురు ఇరాన్ అధికారులు చనిపోయారు. బహుళ అంతస్తుల భవనంలో ఇరాన్ ప్రతినిధులు ఉన్నారనే సమాచారంతో దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. దాడిలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ , ఇరాన్ అనుకూల పాలస్తీనా వర్గాలకు సిరియా హైసెక్యూరిటీ జోన్ హోమ్‌గా ఉంది. అందుకే ఇరాన్ సీనియర్ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అబ్జర్వేటరీ డైరెక్టర్ రామి అబ్దెల్ రెహ్మాన్ అన్నారు. గతనెలలో ఇదే విధంగా దాడి జరిగగా అందులో ఇరాన్ జనరల్ సహా మరో ముఖ్య నేత చనిపోయారు.