ఇండోర్ అభ్యర్థి రికార్డు..10 లక్షలకు పైగా మెజారిటీ!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ రికార్డు సృష్టించారు. తన సమీప అభ్యర్థిపై ఏకంగా 10,08,077 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Update: 2024-06-04 18:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ రికార్డు సృష్టించారు. తన సమీప అభ్యర్థిపై ఏకంగా 10,08,077 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు 12,26,751ఓట్లు రాగా..తన సమీప బీఎస్పీ అభ్యర్థి అయిన లక్ష్మణ్ సోలంకికి 51,659 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థానంలో నోటాకు 2,18,674 ఓట్లు రావడం గమనార్హం. నోటా చరిత్రలోనే ఒక నియోజకవర్గంలో ఇంత భారీగా ఓట్లు పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా బీజేపీ నేత ప్రీతమ్ ముండే పేరిట రికార్డు ఉండగా..దానిని శంకర్ లాల్వానీ అధిగమించారు. కాగా, ఇండోన్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడం గమనార్హం. అక్కడ కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని బీజేపీలో చేరారు.


Similar News